టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పటి నటి రాధిక శరత్ కుమార్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో రాధిక శరత్ కుమార్ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ మంచి పేరు, ప్రశంసలు అందుకుంది. ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ వంటి వివిధ భాషలలో అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. 

ముఖ్యంగా రాధిక తన కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనేక సినిమాలలో నటించారు. రాధిక మెగాస్టార్ చిరంజీవి, ఇద్దరు మంచి స్నేహితులు. ఇప్పటికీ వారి ఫ్రెండ్షిప్ అలానే కొనసాగుతూ ఉండడం గమనార్హం. రాధిక హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో రాధిక ముందు వరుసలో ఉండేది. ఇక ఈ మధ్యకాలంలో రాధిక కేవలం సహాయక నటిగా కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో హీరోయిన్లకు తల్లి, అత్త వంటి పాత్రలలో నటిస్తున్నారు.


అంతేకాకుండా రాధికా శరత్ కుమార్ రాజకీయాలలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక రాధిక వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే....రాధిక పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. రాధిక అల్లుడు ఒక క్రీడాకారుడు అని చాలామందికి తెలియదు. అతని పేరు అభిమన్యు మిథున్. రాధిక కుమార్తెను అభిమన్యు మిథున్ కు ఇచ్చి 2016లో వివాహం జరిపించారు. పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాధిక అల్లుడు అభిమన్యు మిథున్ భారత క్రికెట్ జట్టుకు కూడా ఆడాడు. అంతేకాకుండా అభిమన్యు మిథున్ ఐపిఎల్ టోర్నమెంట్ లో ఆర్సిబి మరియు ముంబై ఇండియన్స్ తరఫున ఆడి ఎన్నో విజయాలను అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: