మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ లలో స్వీడ్ గేమ్  వెబ్ సిరీస్ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఇందులో ప్రముఖ నటుడుగా పేరుపొందిన ఓ యోంగ్ (ప్లేయర్ 001) ఆటలో కనిపిస్తారు. అయితే తాజాగా ఈ నటుడు జైలు పాలైనట్లు తెలుస్తోంది.అది కూడా మహిళ పైన లైంగిక వేధింపులు పాల్పడినందుకు గాను ఒక ఏడాది పాటు జైలు శిక్ష వేసినట్లు తెలుస్తోంది. 80 ఏళ్ల వయసులో స్వీడ్ గేమ్ లో అద్భుతమైన నటనను కనబరిచిన ఓ యోంగ్ మహిళ పైన లైంగిక వేధింపులు పాల్పడ్డారంటూ 2017లో ఎన్నికైన కేసు నమోదు కావడం జరిగింది.



తాజాగా ఈ కేసులో కోర్టు సైతం తీర్పు ఈ రోజున ఇవ్వగా ఒక ఏడాది పాటు ఈ నటుడికి జైలు శిక్ష ఇస్తూ తీర్పుని తెలియజేసింది.ఓ యోంగ్ తన నేరాన్ని తిరస్కరించినప్పటికీ సైతం బాధితురాలు వాంగ్మూలాన్ని మాత్రమే కోర్టు పరిగణంలోకి తీసుకొని మరి తుది తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఓ యోంగ్ సుమారుగా 50 ఏళ్లపాటు ఇండస్ట్రీలో పని చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే ఒక జూనియర్ ఆర్టిస్ట్ పైన ఈ నటుడు లైంగిక వేధింపులు చేశారనే విధంగా వార్తలు వినిపించడంతో పాటు ఆమె కేసు కూడా వేయడంతో ఆమె తరుపున న్యాయవాదులు వాదించారు.


దీంతో ఈ నటుడుకి జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అయితే కేసు వేసినప్పటి నుంచి బాధితురాలు భయంతోనే బతికేస్తున్నానంటు తెలియజేసింది. 2017 లో ఒక పల్లెటూర్లో థియేటర్ ప్రదర్శనకు వెళ్లిన ఓ యోంగ్ ఈ అగాయిత్యానికి పాల్పడ్డారని ఆ బాధితురాలు తెలియజేయాల్సింది.. కానీ అక్కడ ఒక సరస్సు దాటేందుకే తాను ఆ మహిళ చేయని పట్టుకున్నాను అంటూ తెలిపారట నటుడు ఓ యోంగ్. అందుకు ఆ నటుడు క్షమాపణలు కూడా చెప్పారట.. కానీ ఆ బాధితురాలు వాంగ్మూలం తీసుకునే మరి కోర్టు ఈ నటుడు పైన 80 ఏళ్ల వయసులో ఒక ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: