సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'కూలీ'..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా  . ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ 'కూలీ' నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్” సినిమా గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది..దీనితో లోకేష్ కనగరాజ్ సినిమా తో భారీ హిట్ అందుకోవాలని రజనీకాంత్ భావిస్తున్నారు.. 

''కూలీ' సినిమా టీజర్ ఏప్రిల్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కోలీవుడ్ ఎప్పటి నుంచో కలగంటున్న 1000 కోట్లు డ్రీమ్ ఈ సినిమా తో నెర వేరుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గోల్డ్‌ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కుతుంది..ఈ సినిమా లో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమా కు మ్యూజిక్ అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ రిలీజ్  చేసారు.. ఈ పోస్టర్ లో తలైవా విజిల్ వేస్తున్న స్టన్నింగ్ లుక్ అదిరిపోయింది..ఈ సినిమా ను మేకర్స్ ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు..కూలీ రిలీజ్ డేట్ ప్రకటించడం తో తలైవా ఫ్యాన్స్ ఈ న్యూస్ ని సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: