డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో హీరోగా స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సిద్దుకి జోడీగా తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఇందులో వైష్ణవి చైతన్య ద్విపాత్రాభినయం చేస్తుంది.  జాక్  కొంచెం క్రాక్ సినిమా  సమ్మర్ స్పెషల్ గా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకి రానుంది.  జాక్ సినిమాకు  బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ఒక్క మంచి కామిడీ టైమింగ్ తో చక్కగా వినోదాన్ని పంచుతుందని సమాచారం.
 
ఇదిలా ఉండగా.. తాజాగా జాక్ కొంచెం క్రాక్ సినిమా టైలర్ ఈవెంట్ ని హైదరాబాద్ లో మూవీ మేకర్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. జాక్ పాత్ర సిద్ధూ ఫ్లేవర్ లో కనిపిస్తుందని చెప్పాడు. అలా బయటికి కనిపించినప్పటికి లోపల మాత్రం ఆయన స్టైల్ భావోద్వేగాలు, సందేశం ఉంటుందని తెలిపాడు. సిద్ధూతో పనిచేయడం ఏ డైరెక్టర్ కి అయిన చాలా ఈజీ అని.. సిద్ధూని నమ్మితే చాలు, సన్నివేశం అద్బుతంగా వస్తుందని చెప్పుకొచ్చాడు. జాక్ సినిమా ప్రాజెక్టులో మొదటి నుండే సిద్ధూ జొన్నలగడ్డ భాగమయ్యాడని తెలిపాడు. సిద్ధూకి ఈ సినిమాలోని జాక్ పాత్రకి చాలా స్వేచ్చా ఇచ్చామని భాస్కర్ చెప్పారు. టిల్లు కూడా పాత్రకి తగట్టు చాలా బాగా నటించడని అన్నారు.

 
అలాగే హీరోయిన్ వైష్ణవి చైతన్య తన కళ్లతోనే మాట్లాడుతుంది, నటిస్తుందని చెప్పారు. వైష్ణవి గొప్ప స్థాయికి వెళ్తుందని బొమ్మరిల్లు భాస్కర్ చెప్పుకొచ్చారు. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఒక జాక్ ఉంటాడని.. ఆ జాక్ ఎవరనేది ఎవరికి వాళ్లు తెలుసుకోవాలనేదే ఈ సినిమా ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఇక టిల్లు సినిమాతో హిట్ కొట్టిన సిద్ధూ జొన్నలగడ్డ, అలాగే బేబీ సినిమాతో హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: