
ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. దీంతో ప్రేక్షకులు సినిమా థియేటర్ లకు వెళ్లి చూడడమే మానేశారు. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతి వారం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం వంటి భాషలలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఈ సినిమాతో పాటుగా ఈ వారం మరో 10 పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అవ్వనున్నాయి.
మాధవన్ నటించిన టెస్ట్ సినిమా, త్రిగుణ్ నటించిన ఉద్వేగం సినిమా, పూజిత పొన్నాడ నటించిన ఉత్తరం మూవీ స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. శ్రీహన్ నటించిన లైఫ్ పార్ట్ నర్, రాజీవ్ కనకాల నటించిన హోమ్ టౌన్ సినిమా ప్రేక్షకులను ఈ వారం అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి వీక్షించి, ఎంజాయ్ చేయండి.