పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ తన నటన, యాక్టింగ్ తో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఈశ్వర్ సినిమా అనంతరం ప్రభాస్ వెనుదిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోగా కొనసాగాడు. ఇప్పటివరకు ప్రభాస్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.


ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ హీరోకి విపరీతంగా అభిమానులు పెరిగిపోయారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా అనుష్క  నటించింది. బాహుబలి సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా బాహుబలి 2 ను నిర్మించారు. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది.


ఈ సినిమాలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా లాంటి ఎంతోమంది స్టార్ నటీనటులు నటించారు. అయితే ఈ సినిమాలో మొదట హీరో ప్రభాస్ ను కాకుండా జక్కన్న వేరే హీరోను పెట్టి సినిమా తీయాలని అనుకున్నారట. ప్రభాస్ స్థానంలో హీరో సూర్యను పెట్టి సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నారట. కానీ ఏమైందో తెలియదు ఆ ఆఫర్ కాస్త ప్రభాస్ వద్దకు వెళ్ళింది.


జక్కన్న ఈ ఆఫర్ ప్రభాస్ కి ఇవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించి థియేటర్లలో రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా అనంతరం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్, స్పిరిట్, సలార్-2 సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: