
స్టోరీ విషయానికి వస్తే..
ఆరాధ్య దేవికి చీరలు అంటే మహా ఇష్టం కాలేజీకి కూడా ఈమె చీరలోనే వెళుతూ ఉంటుంది.. రీల్స్ చీరలలోనే చేస్తూ ఒకసారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా ఒక ఫోటోగ్రాఫర్ కిట్టు (సత్య యాదు) ఈమెను అలా చీరలో చూసి ఇష్టపడతారు.. అలా ఆరాధ్యను ఫాలో అవుతూ దొంగచాటుగా ఫోటోలు తీస్తూ.. చివరికి ఇంస్టాగ్రామ్ లో చాట్ చేస్తూ ఆమె ఫోటో షూట్ కి ఒప్పిస్తారు అలా కిట్టు ఆరాధ్యకు దగ్గరవుతారు.. కానీ ఆరాధ్య మాత్రం కిట్టుని ఒక స్నేహితుడు లాగానే చూస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఆరాధ్య అన్నయ్య రాజు (సాహిల్ సాంబ్యాల్ ) కిట్టుతో గొడవ పడడంతో అప్పటినుంచి ఆరాధ్య, కిట్టును దూరంగా పెడుతుంది.. అయినా కూడా కిట్టు ఆరాధ్యను వెంబడిస్తూ ఉంటారు. చివరికి ఒక సైకోలా మారి ఆమెను వేధిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆరాధ్య కుటుంబం కిట్టు మీద పోలీస్ కేసు పెడుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్నదే సినిమా కథ.
ఆరాధ్య పాత్రలో ఆరాధ్య అదరగొట్టేసింది.. ఇక వర్మ కి కావాల్సినట్టుగా ఆమెను తెర పైన చూపించారు. సైకో కిట్టు పాత్రలో సత్యాయాదు అదరగొట్టేశారు. మిగిలిన ఆటలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించడం లేదు. తెర పైన ఆరాధ్యను అందంగా చూపించారు.. ఇందులో సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు చాలా క్రిప్సీగా ఉన్నాయి. వర్మ గత చిత్రాలతో పోలిస్తే ఏది కొంతమేరకు బెటర్.. ఆర్జీవి సినిమాలకు కూడా పెద్దగా బడ్జెట్ ఉండదు కాబట్టి ఈ సినిమా ఉన్నంతలను చాలా రిచ్గా చూపిస్తారు. మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా రాబట్టిందో చూడాలి.