ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలు  కథలను రాసుకునేటప్పుడు  పలానా హీరోయిన్ పలానా హీరో  ఈ సినిమాలో చేస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కథలన్నీ రెడీ చేస్తారు. చివరికి ఈ కథను వారికి వినిపించే సమయానికి వారికి డేట్స్ కుదరకనో లేదంటే ఇతర సమస్యల వల్ల వారు రిజెక్ట్ చేసిన సందర్భాలు అనేక ఉంటాయి. ఇక ఇవే కాకుండా కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయి కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలా రామ్ చరణ్ చేసినటువంటి చిరుత సినిమా ముందుగా రామ్ చరణ్ అనుకోలేదట. ఈ సినిమాలో మరో హీరో చేశారట కొంత షూటింగ్ జరిగిన తర్వాత అంతా క్యాన్సిల్ అయిపోయిందట. మరి ఆ హీరో ఎవరు ఎందుకు సినిమా షూటింగ్ తర్వాత క్యాన్సిల్ అయింది వివరాలు చూద్దాం.. 

తాజాగా రచయిత తోట ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. చిరుత సినిమా కథ ముందుగా పూరి జగన్నాథ్ బ్రదర్ సాయిరాంశంకర్ కు వినిపించారట. ఆయనకు నచ్చి ఓకే చెప్పడంతో బ్యాంకాక్ వెళ్లి కాస్త షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇదే టైంలో ఏవో కారణాల వల్ల సినిమా పూర్తిగా ఆగిపోయింది. చివరికి ఈ కథను  చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లారు అశ్వినీ దత్.. మెహర్ రమేష్ దగ్గర మంచి కథ ఉంది దాన్ని రామ్ చరణ్ తో చేయించండి అంటూ చిరంజీవికి చెప్పారట. దీంతో చిరంజీవి కూడా కథ విని చాలా బాగుంది కాస్త చేంజ్ చేసి పవర్ఫుల్ మాస్ సినిమా వచ్చేలా చూడండి అంటూ చెప్పారట.

అయితే ఈ సినిమాను మెహర్ రమేష్ కాకుండా పూరి జగన్నాథ్ తో తీస్తే బాగుంటుందని చిరంజీవి సజెస్ట్ చేశారట. మెగాస్టార్ చెప్పినట్టుగానే ఈ సినిమాను రామ్ చరణ్ తో పూరి జగన్నాథ్ పూర్తి చేశారు.. ఇంకేముంది టైటిల్లో ఏ విధమైనటువంటి చిరుత అనే పేరు ఉందో ఆ విధంగానే చిరుత పులిలా సినిమా థియేటర్లలో అద్భుతమైన హిట్ సాధించింది. దీంతో రామ్ చరణ్ కు  మాస్ హీరోగా మంచి గుర్తింపు లభించింది.. సాయిరాం శంకర్ చేయాల్సినటువంటి సినిమా  రామ్ చరణ్ దగ్గరికి వచ్చి సూపర్ హిట్ అందుకోవడంతో సాయిరాంశంకర్ ఆ సినిమా ఎందుకు చేయలేకపోయానని చాలా బాధపడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి: