వేణు స్వామికి మహిళా కమిషన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఇంకా ఆయన బుద్ధి మార్చుకోవడం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఆయన ఉగాది పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉంటాయి అనేది పేరు బయట పెట్టకుండా పరోక్షంగా వారిపై కామెంట్లు చేశారు. ముఖ్యంగా  ఓ హీరో వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనం అవుతుంది అని  వేణు స్వామి చేసిన కామెంట్లు ఆ హీరో అభిమానులను హర్ట్ చేశాయి.మరి ఇంతకీ వేణు స్వామి ఏ హీరో గురించి చెప్పారో ఇప్పుడు చూద్దాం.. వేణు స్వామి ఎక్కువగా ప్రభాస్,నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటారు. నాగచైతన్యకి పెళ్లి కలిసి రాదని రెండో పెళ్లి కూడా పెటాకులు అవుతుందని చెప్పాడు.

అలాగే ప్రభాస్ కి ఆరోగ్యం సహకరించదని,ఆయన ఎప్పుడూ అనారోగ్యం బారిన పడతారని తెలియజేశారు.ఇక రీసెంట్ గా ఆయన మాట్లాడిన ఒక ఆడియో కాల్ కూడా వైరల్ అయింది. ఆ ఆడియో కాల్ లో సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరు సూసైడ్ చేసుకుంటారని, ప్రభాస్ కి ప్రాణగండం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే ఎప్పుడు అల్లు అర్జున్ మీద పాజిటివ్ గా కామెంట్లు చేసే వేణు స్వామి తాజాగా సంచలన కామెంట్లు చేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీ పతనం మొత్తం స్టార్ట్ అయిందని,అది కూడా అల్లు అర్జున్ వల్లేనని,అల్లు అర్జున్ వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ పతనం అవ్వబోతుందని, అల్లు అర్జున్ చేసిన పనికి తెలుగు ఇండస్ట్రీ బుగ్గిపాలు అవ్వబోతుంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

అంతేకాదు అల్లు అర్జున్ మీద శని ఉందని, ఆ శని ప్రభావం జైలుకు వెళ్లడంతో కొంతమేర తగ్గినప్పటికీ ఇంకొంత మాత్రం అలాగే ఉంది అని,డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు వచ్చి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని తెలిపారు. అంతేకాదు వీరిద్దరి జాతకాల ప్రకారం కచ్చితంగా త్వరలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వస్తాయని తెలియజేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పతనం అవ్వడానికి కారణం అల్లు అర్జున్ అయ్యాడు అంటూ వేణు స్వామి మాట్లాడిన మాటలు అల్లు అభిమానులకు అస్సలు రుచించడం లేదు. దీంతో ఇన్ని రోజులు పాజిటివ్ వ్యాఖ్యలు చేసి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని వేణు స్వామి పై ఫైర్ అవుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి: