ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే..జూనియర్ ఎన్టీఆర్ పేరే మారు మ్రోగిపోతుంది . దానికి కారణం ఆయన రీసెంట్గా మ్యాడ్ 2 సినిమా సక్సెస్ ఈవెంట్లో పాల్గొనడమే . నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులతో ఇలా ముచ్చటించి చాలా కాలమే అవుతుంది.  దేవర సినిమా టైంలో ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఫాన్స్ తో మాట్లాడాల్సింది . కానీ కొన్ని కారణాల చేత అది క్యాన్సిల్ అయింది.  మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు ఫ్యాన్స్ కోరికను  నెరవేర్చాడు జూనియర్ ఎన్టీఆర్ .


రామ్ నితిన్ - నార్నేనితిన్ - సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మ్యాడ్ 2. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే దాదాపు 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్గా మారిపోయింది . తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్ . ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా విషయాలను బయటపెట్టారు . మరీ ముఖ్యంగా అదుర్స్ 2 ఎందుకు చేయడం లేదు.. దేవర 2 పై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు .. అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు.



ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ డైలాగ్ ను ఎన్టీఆర్ చెప్పడం హైలైట్ గా మారింది . త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది సినిమాలోని  ఓ డైలాగ్ .."మీ వెనుక ఏదో శక్తి ఉంది"  అంటూ పోసాని కృష్ణ మురళి చెప్తారు. అదే డైలాగ్ ని రిపీట్ చేస్తూ మ్యాడ్ 2  సక్సెస్ స్టేజ్ పై "ఇంత సక్సెస్సినిమా అవ్వడానికి ఒకే ఒక కారణం నాగవంశీ అంటూ నాగవంశీ ఒక శక్తి లా ఉన్నాడు అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు ". దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటల తాలూకా వీడియో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది.  ఫ్యాన్స్ ఎప్పటినుంచో వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాలి అంటూ వెయిట్ చేస్తున్నారు . కానీ అది కుదిరేలా లేదు.  కనీసం  పవన్ డైలాగ్ ని ఎన్టీఆర్ నోట వినడం ఒకందుకు హ్యాపీగానే ఉంది అంటున్నారు నందమూరి అభిమానులు . త్వరలోనే దేవర 2, వార్ 2 సినిమాల తో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్..!

మరింత సమాచారం తెలుసుకోండి: