
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఒక మూవీకి కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు అని అఫీషియల్ ప్రకటన కూడా త్వరలోనే ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే మరొక పక్క అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయబోతున్నాడు అని .. అట్లీ సినిమా ముందు తెరకెక్కుతుందా..? సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా ముందు సెట్స్ పైకి వస్తుందా..? అనేది బిగ్ క్వశచన్ మార్క్ గా ఉంది అంటున్నారు జనాలు.
అయితే ఇదే మూమెంట్లో అల్లు అర్జున్ ని ముంబై మీడియా పట్టించుకోకపోవడం లేదు. ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ ముంబైకి వెళ్తే అక్కడ మీడియా ఎలా హైలైట్ గా వాళ్ళని ఫోకస్ చేస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా సరే ప్రభాస్ వెనుక మీడియా వెళ్తూనే ఉంటుంది . ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వార్ 2 సినిమా షెడ్యూల్స్ కోసం ఎప్పుడు ముంబైకి వెళ్లిన ఎన్టీఆర్ కి సంబంధించి ఫొటోస్ క్లిక్ చేస్తూనే ఉంటుంది . హైలెట్ చేస్తుంది ముంబై మీడియా . అయితే బన్నీ విషయంలో మాత్రం ఎందుకు అది మిస్ అయింది. పుష్ప 2 సినిమా అంత పెద్ద హిట్ అయినా సరే బన్నీని ముంబై మీడియా పట్టించుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియా లో జనాలు దీనిపై వ్యంగ్యంగా వెటకారంగా కూడా కౌంటర్స్ వేస్తున్నారు..!