సిఐడి టెలివిజన్ షో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇది బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.  భారతీయ టెలివిజన్ షో లోనే అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన షో ఏదైనా ఉంది అంటే కచ్చితంగా అందరూ ముందుగా చెప్పుకునేది సిఐడి . రాత్రి 9 అవ్వగానే చాలు ప్రతి ఒక్కరు కూడా టీవీల ముందు కూర్చొని ఈ సిఐడిని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు . చిన్న పెద్ద తేడా లేకుండా సిఐడి షోను బాగా అభిమానిస్తూ .. ఆరాధిస్తూ..ఎంకరేజ్ చేస్తూ ఉంటారు . అయితే ఈ సిఐడి లో నటించే ప్రతి ఒక్కరికి ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉంది .
 

కానీ అందరికన్నా ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండేది ఏసిపి పాత్రలో తనదైన స్టైల్ లో నటించి మెప్పించిన ప్రద్యూమన్ అనే చెప్పాలి. ఆయన అన్నా..ఆయన పాత్ర అన్నా చాలామందికి చాలా చాలా ఇష్టం.  ప్రత్యేకంగా పర్సనల్ గా ఇష్టపడుతూ ఉంటారు . ఆయన చెప్పే డైలాగ్స్ బాడీ డెలివరీ అందరికీ బాగా నచ్చేస్తూ ఉంటుంది . అయితే ఇప్పుడు ఏ సి పి ప్రద్యూమన్ పాత్రను ముగించే పనిలో ఉంది సిఐడి టీం అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.



ఈ షోలో పెద్ద ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.  నిర్మాతలు ఏసీపి ప్రద్యుమన్ పాత్రను ముగించే ఆలోచనలో ఉన్నారట . అదే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏసిపి ప్రద్యుమన్ పాత్ర బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతుందట. తద్వారా ఈ సిఐడి నుంచి ఇక ఆయనకి పూర్తిగా వీడ్కోలు పలికే విధంగా భావిస్తున్నారట.  ఏసిపి ప్రద్యూమన్ కి సంబంధించిన లాస్ట్ మూడు ఎపిసోడ్లు చిత్రీకరణ పూర్తి అవ్వగానే ఆయనకు ఈ సిఐడి నుంచి ఎండ్ కార్డ్ పడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  సిఐడి బృందం నాయకుడిగా ప్రద్యుమన్ ప్రేక్షకులను ఎంత ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి అలాంటి ప్రద్యుమన్ ని ఇక షోలో చూపించకపోతే షోకి అనుకొని టిఆర్పి రేటింగ్స్ వస్తాయా..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!





మరింత సమాచారం తెలుసుకోండి: