స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం. 1 సినిమాలో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, అశోక్, రాఖీ, యమదొంగ, జనతా గ్యారేజ్, అదుర్స్ లాంటి సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత దేవర మూవీలో నటించి పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ లావుగా ఉన్నాడని చాలా విమర్శలు ఎదురుకున్నప్పటికి.. ఆ రోజు వెనకడుగు వేయకుండా నిలిచి ఈ రోజున స్టార్ హీరో అయ్యాడు. ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఎన్టీఆర్ నటన చాలా అద్బుతంగా ఉంటుంది. అలాగే ఈయన డాన్స్ చేస్తే మాత్రం, ఎవరు ఈయనకి పోటీగా రారంటే అతిశయుక్తి కాదు. 

 
అయితే తాజాగా ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. ఎన్ని కష్టాలు ఉన్న ఒకరు వచ్చి నవ్వించారంటే మనం అన్ని మర్చిపోతాము. ఈ విషయంలో మ్యాడ్ స్క్వేర్ తో ప్రేక్షకులని గొప్పగా నవ్వించిన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ విజయం సాధించారు. ఏ నటుడికైనా కామిడీ చేయడం చాలా కష్టమైన పని. అందుకే నేను అదుర్స్ 2 సినిమా చేయడం లేదు. నాకు భయం ఉంది.. అప్పుడు నవ్వించినట్లు ఇప్పుడు నవ్విస్తానో లేదో అని' అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: