టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం భారత్ అనే నేను అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ కి జోడిగా కియార  అద్వానీ నటించగా ... టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఒకరు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న భరత్ అనే నేను మూవీ ని మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. భరత్ అనే నేను మూవీ ని ఏప్రిల్ 19 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే మహేష్ బాబు నటించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. 

అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఎన్నో రికార్డును నెలకొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మరికొన్ని రోజుల్లోనే మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ అయినటువంటి భరత్ అను నేను మూవీ కూడా రీ రిలీజ్ కానుంది. దానితో ఈ సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి రీ రిలీజ్ లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది అని మహేష్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి భారత్ అనే నేను మూవీ రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: