
పుష్ప2 సినిమా కారణంగా ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే విషయం కూడా అందరికీ తెలుసు . దాదాపు 370 కోట్లు అందుకున్నాడు ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ రెమ్యూనరేషన్ అంటూ ప్రచారం జరిగింది . కాగా ప్రజెంట్ అల్లు అర్జున్..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా కోసం బిజీగా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరోక పక్క బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తో కూడా మూవీ ఫిక్స్ అయ్యింది అంటున్న్నారు బాలీవుడ్ జనాలు.
అయితే ఇదే మూమెంట్ లో అల్లు ఫ్యామిలీ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ వినిపించబోతుంది . హైదరాబాదులోని కోకాపేట ఏరియాలో అల్లు స్టూడియోస్ పేరుతో మరొక కొత్త సినిమా థియేటర్ ని నిర్మిస్తున్నారట అల్లు ఫ్యామిలీ . తాజాగా ఈ భూమి పూజ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది . ఈ భూమి పూజ కార్యక్రమంలో అల్లు బాబి ..అల్లు శిరీష్ ..అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు . డాల్బీ సౌండ్ సిస్టం కూడా పెట్టిస్తున్నారట. ఇప్పటీ వరకు ఇండియాలో ఇది లేదు . ఫర్ ద ఫస్ట్ టైం అల్లు ఫ్యామిలీ థియేటర్లోనే ఈ సిస్టం ఏర్పాటు చేస్తున్నారట . దీంతో అల్లు ఫ్యామిలీ నిర్మిస్తున్న కొత్త థియేటర్ పై ఆసక్తి నెలకొంది..!