యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస విజయాలు తారక్ రేంజ్ ను, మార్కెట్ ను ఊహించని స్థాయిలో పెంచుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో తారక్ లుక్స్ విషయంలో వరుసగా విమర్శలు వస్తున్నాయి. మొదట జెప్టో యాడ్ లో నటించిన సమయంలో తారక్ లుక్స్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించగా తాజాగా మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో తారక్ లుక్స్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.
 
తారక్ మరీ సన్నబడ్డాడని ఈ లుక్ ఆకట్టుకునే విధంగా లేదని అభిప్రాయాలు వినిపించాయి. వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్లు తారక్ దృష్టికి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ విమర్శల విషయంలో తారక్ మైండ్ లో ఏముందో తెలియాల్సి ఉంది. తారక్ ప్రశాంత్ నీల్ సినిమాలో ఏ లుక్ లో కనిపిస్తారో తెలియాలి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.
 
2026 సంక్రాంతి పండుగకు ఈ సినిమా షెడ్యూల్ అయ్యి ఉన్నా ఆ సమయానికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో కొంతమేర కేర్ తీసుకుంటే బాగుంటుంది. వయస్సు పెరుగుతుండటం కూడా ఎన్టీఆర్ లుక్స్ పై కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
 
జూనియర్ ఎన్టీఆర్ దేవర2 సినిమా గురించి సైతం స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. దేవర2 సినిమా ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారంలో ఏ మాతం నిజం లేదని క్లారిటీ వచ్చింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు భవిష్యత్తులో కెరీర్ పరంగా సంచలన హిట్లు దక్కాలని పాన్ ఇండియా స్థాయిలో తారక్ నంబర్ వన్ హీరోగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.


 


మరింత సమాచారం తెలుసుకోండి: