స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత దేవర మూవీలో నటించి పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో సందడి చేశారు.
 
ఈ వేడుకలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ నెల్సన్ మూవీ గురించి లీక్ చేసేశాడు. 'త్వరలోనే దేవర 2 సినిమా అప్ డేట్ ఉంటుంది. నాగవంశీకి సుఖం ఎక్కువైంది. నాగవంశీ డైరక్టర్ గా కాకుండా.. నిర్మాతగా కూడా త్వరలో ఒక సినిమా ఉంటుంది. అది మొదలయ్యాక అభిమనులందరూ నాగవంశీని ఫుల్ గా ఆడుకోండి. నాగవంశీ పైకి కఠినంగా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం చాలా మంచిది. అలాగే డైరెక్టర్ నాగవంశీ నిర్మాతగా నెల్సన్ ప్రాజెక్ట్ ఉంటుంది' అని ఎన్టీఆర్ హింట్ ఇచ్చేశారు. అయితే ఇప్పటికీ ఆ సినిమాకి హీరో ఎవరనేది డిసైడ్ అవ్వలేదు. అప్పట్లో నెల్సన్ హీరోగా ఎన్టీఆర్ అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్లోలో సీక్రెట్ ని లీక్ చేసేశాడన్న మాట.  


ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం. 1 సినిమాలో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, అశోక్, రాఖీ, యమదొంగ, జనతా గ్యారేజ్, అదుర్స్ లాంటి సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్ లావుగా ఉన్నాడని చాలా విమర్శలు ఎదురుకున్నప్పటికి.. ఆ రోజు వెనకడుగు వేయకుండా నిలిచి ఈ రోజున స్టార్ హీరో అయ్యాడు. ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఎన్టీఆర్ నటన చాలా అద్బుతంగా ఉంటుంది. అలాగే ఈయన డాన్స్ చేస్తే మాత్రం, ఎవరు ఈయనకి పోటీగా రారంటే అతిశయుక్తి కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: