- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

గత ఏడాది చివర్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాతో భారీ విజయం తన ఖాతాలో వేసుకుంది మైత్రీ సంస్త‌. 2026 లో ఈ సంస్థ నుంచి భారీ సినిమాలు రాబోతున్నాయి. ఈ గ్యాప్ లో నితిన్ హీరోగా రాబిన్ హుడ్ అనే ఓ మీడియం రేంజ్ సినిమాని విడుదల చేశారు. నితిన్ కు జోడిగా శ్రీలీల హీరోయిన్ గా నటించిగా వెంకి కుడుముల దర్శకుడు. రిలీజ్ కి ముందు వినూత్న ప్రచారాలతో ఈ సినిమాకు మంచి హైప్‌ వచ్చింది. కాకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కనీసం 20 శాతం రికవరీ కూడా రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకు కనీసం 50 కోట్లు ఖర్చు అయింది.


ఓటిటి - నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో సగం డబ్బులు తిరిగి వచ్చాయి. అటు ఇటుగా 20 కోట్లు అయినా ఈ సినిమాతో మైత్రి వాళ్ళు నష్టపోయినట్టు తెలుస్తోంది. మైత్రికి 20 కోట్లు పెద్ద నష్టం కాదు .. భారీ చిత్రాల మధ్య రొటేషన్ లో ఈ సినిమా తాలూకు నష్టాలు పెద్దగా ఎఫెక్ట్ చేయవు. కానీ మైత్రి తాలూకు నమ్మకాన్ని కాస్త సడలించే ప్రమాదం ఉంది. ఇటీవల మైత్రి అన్ని భారీ సినిమాలే నిర్మిస్తోంది చిన్న మీడియం సైజు సినిమాలపై ఈ సంస్థ దృష్టిపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. మీడియం రేంజ్ హీరోలతోనే ప్రాజెక్టులు సెట్ చేయాలని మైత్రి ఆలోచన.


అయితే రాబిన్ హుడ్ లాంటి ఫలితాలు సంస్థకు ఎదురు దెబ్బగా నిలుస్తాయి. రాబిన్ హుడ్ ఓటిటి వల్ల సగం రికవరీ అయింది. అది కూడా మైత్రి ఇలాంటి బ్యానర్ ఉండటం వల్లే .. అదే వేరే బ్యానర్ అయితే ఆ మాత్రం రికవరీ కూడా ఉండదు. ఈ ప్లాపు మైత్రిని ఎఫెక్ట్ చేయటం పక్కన పెడితే హీరోగా నితిన్ ద‌ర్శ‌కుడిగా వెంకి కుడుములపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. నితిన్ కు ఇటీవల కాలంలో వరుసగా ప్లాపులు త‌గులుతున్నాయి. రాబిన్ హుడ్ తో అయినా హిట్ కొడ‌తాడ‌ని అందరూ అనుకున్నారు. ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు కూడా కానీ ఫలితం దక్కలేదు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేసి పెద్ద హీరోలు దృష్టిలో పడదాం అనుకున్నా దర్శ‌కుడు వెంకీది అదే పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: