ఇండియన్ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఆటలలో క్రికెట్ కూడా ఒకటి.. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే చాలు నానా హంగామా చేస్తూ ఉంటారు. ఇండియాలో ఎక్కువగా ఇప్పుడు ఐపీఎల్ ఫీవర్ కూడా నడుస్తూ ఉన్నది. ఇలాంటి సమయంలోనే టెస్ట్ అనే ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్మింగ్ అవుతోంది. మరి క్రికెట్ మ్యాచ్ ఫార్మాట్లో తీసుకువచ్చిన ఈ టెస్ట్ సినిమా విన్నింగ్ అయిందా లేదా చూద్దాం.


అర్జున్ (సిద్ధార్థ్) స్టార్ క్రికెటర్.. కుటుంబం కంటే ఎక్కువగా క్రికెట్ ని ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని రోజులుగా ఫామ్ లో లేకపోయినప్పటికీ చెన్నై వేదికగా పాకిస్తాన్ తో జరిగే ఒక కీలకమైన టెస్ట్ మ్యాచ్లో స్థానాన్ని సంపాదించుకొని తనని తాను నిరూపించుకోవాలని చూస్తూ ఉంటారు. శరవణన్ (మాధవన్) సైంటిస్ట్ గా కనిపిస్తారు.. పెట్రోల్ లేకుండా నీటితో నడిచే ఒక ఇంజన్ ని తయారు చేసి ప్రభుత్వ అనుమతి కోసం ఎన్నో రకాల ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రాజెక్టు ఓకే చెప్పడానికి 50 లక్షలు డిమాండ్ చేస్తారు. ఇతడి భార్య పాత్రలో కుముద (నయనతార) టీచర్ గా నటించింది. 34 ఏళ్లయిన వీరికి పిల్లలు పుట్టారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనాలి చూస్తారు. అందుకు రూ .5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.. ఆల వీరి ముగ్గురి జీవితాలను చెన్నై టెస్ట్ ఏ విధంగా మలుపు తిప్పింది? వీరు ఎదుర్కొన్న సమస్యలేంటి? ఎవరు సక్సెస్ అయ్యారు? ఎవరు బౌల్డ్ అయ్యారు? అన్నది సినిమా కథ.


డైరెక్టర్ ఎస్ శశికాంత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. వీరి ముగ్గురి జీవితంలో జరిగిన సంఘటనలు ఫ్యామిలీ డ్రామాగా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. చివరి 30 నిమిషాలలో తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి కథ అసలు బలమని తెలుపుతున్నారు


ప్లస్:
మాధవన్ ,నయనతార, సిద్ధార్థ్ యాక్టింగ్.
సెకండాఫ్ తర్వాత వచ్చే సన్నివేశాలు.

మైనస్:
మొదటి భాగం.
కథలో బలం లేకపోవడం
సుమారుగా రెండున్నర గంటల నిడివి.

మరింత సమాచారం తెలుసుకోండి: