- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ కూలీ ’ టాలీవుడ్ సీనియ‌ర్ హీరో ... కింగ్ నాగార్జున , క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర , శ్రుతిహాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచే మంచి హైప్ ఉంది. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు వ‌స్తుందా ? అని ర‌జ‌నీ అభిమానులు సైతం ఒక్క‌టే ఆస‌క్తి తో వెయిట్ చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా రిలీజ్ డేట్ ను సినిమా యూనిట్ తాజా గా ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగస్టు 14 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేర‌కు వేసిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్ అయితే ఆక‌ట్టుకునేలా ఉంది. అందులో రజనీకాంత్‌ విజిల్‌ వేస్తూ స్టైలిష్ లుక్ లో కనిపించ‌గా ..ఈ పోస్ట‌ర్ దెబ్బ‌తో ఈ సినిమా పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న హైప్ కాస్తా డ‌బుల్ అయిపోయింది.


ఇక కూలీ సినిమా గోల్డ్ స్మగ్లింగ్‌ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశం తో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇదిలా ఉంటే అదే రోజు బాలీవుడ్ కండ‌ల వీరుడు.. హృతిక్‌ రోషన్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం వార్ -2.  స్పై యాక్షన్‌ థ్రిల్లర్ కూడా రిలీజ్ అవుతోంది. ఆ సినిమాను ఆగ‌స్టు 14న రిలీజ్ చేస్తున్న‌ట్టు సినిమా యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఓ అభిమాని పెట్టిన పోస్టుపై యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌  స్పందించింది. ఆ తేదీన అల్లకల్లోలం జరుగుతుందంటూ ఆసక్తి రేకెత్తించేలా పోస్ట్ చేసింది. రెండు పెద్ద సినిమా లు ఒకే రోజు రిలీజ్ కావ‌డం అభిమానుల్లో మాంచి కాక రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: