థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఒక కొత్త సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుందో చూద్దాం.

లవ్ యాపా అనే రొమాంటిక్ కామిడీ సినిమా నిన్నటి నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోగా మహారాజ్ ఫేమ్ జునైద్ ఖాన్ నటించారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ చెల్లెలు ఖుషీ కపూర్ నటించింది. ఈ సినిమాలో అశుతోష్ రాణా ముఖ్య పాత్రలో కనిపించారు.  అయితే ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకుల నుండి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక థియేటర్ లో మిక్స్డ్ టాక్ ని సొంత చేసుకున్న ఈ సినిమా మరి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి మరి.


దీంతో పాటుగా మాధవన్ నటించిన టెస్ట్ సినిమా, త్రిగుణ్‌ నటించిన ఉద్వేగం సినిమా, పూజిత పొన్నాడ నటించిన ఉత్తరం మూవీ స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. శ్రీహన్ నటించిన లైఫ్ పార్ట్ నర్, రాజీవ్ కనకాల నటించిన హోమ్ టౌన్ సినిమా ప్రేక్షకులను ఈ వారం అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి వీక్షించి, ఎంజాయ్ చేయండి

మరింత సమాచారం తెలుసుకోండి: