సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్  గా రావాలంటేనే అన్నింటికీ సన్నద్ధమై ఉండాలి. అన్నింటికీ ఒప్పుకుంటేనే ఇండస్ట్రీలో రాణించగలం అనే విషయం వారు ముందుగా తెలుసుకోవాలి. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది హీరోయిన్లు అన్నింటికీ సిద్ధమై వస్తారు. కానీ కొంతమంది సిద్ధం అవ్వకుండా వచ్చి మధ్యలోనే ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతారు. అలా ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం చాలా ప్రత్యేకం.. ఆ హీరోయిన్ కి డైరెక్టర్ మద్యం తాగించి ఏకంగా ఏడుసార్లు నగ్నంగా షూట్ చేశారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. మద్యం మత్తులో చేసిందా..లేక సినిమా కోసం చేసిందా..ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటి కుబ్రా సైట్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం ఉండదు.కానీ సేక్రెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ చూసిన వాళ్ళందరికీ ఈ హీరోయిన్ గుర్తుంటుంది.

ఈ సిరీస్  లో ఓ ట్రాన్స్ జెండర్ పాత్రలో కుబ్రా నటించింది. ఇందులో ఆమె పేరు కుకు.. 2018లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ వల్ల కుబ్రాకి ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అయితే ఈ వెబ్ సిరీస్ కంటే ముందు ఎన్ని సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఈ ఒక్క వెబ్ సిరీస్ వల్ల వచ్చేసింది .అయితే ఈ వెబ్ సిరీస్ లో జరిగిన ఒక అనుభవం గురించి టైమ్స్ నౌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూబ్రా చెప్పింది.ఆమె మాట్లాడుతూ.. సేక్రెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ కోసం డైరెక్టర్ అనురాగ్ కష్యప్ నాకు ఏకంగా మందు తాగించి మరీ ఓ సన్నివేశం తెరకెక్కించారు.అయితే ఓ సీన్ కోసం నేను నవాజుద్దీన్ సిద్ధిఖీ ముందు బట్టలు విప్పి నగ్నంగా చేసే సన్నివేశం ఉంటుంది. అయితే ఈ సీన్ చేసే ముందు డైరెక్టర్ అనురాగ్  నాకు ఒక పెగ్గు విస్కీ తాగమని చెప్పారు. కానీ ఆ టైంలో ఎందుకని అడగగా విస్కీ తాగితేనే డైలాగ్స్ బాగోద్వేగంతో వస్తాయని చెప్పారు. 

అయితే ఈ సన్నివేశం కోసం నేను ఒప్పుకోవడంతో పెగ్గు విస్కీ తాగాను. ఆ తర్వాత బట్టలు విప్పి ఏ అమ్మాయి కూడా చేయని సీన్ చేశాను. అయితే ఆ సీన్ అయిపోయాక డైరెక్టర్ సీన్ సరిగ్గా రాలేదని నన్ను ఒప్పించి దాదాపు ఏడుసార్లు టేక్స్ తీసుకొని నాతో నగ్నంగా సన్నివేశాలు చేయించారు. అయితే ఆ సీన్ చేయడానికి నేను ఒప్పుకున్నాను కాబట్టి అన్నీ నా ఇష్టప్రకారమే జరిగాయి. అలాగే ఆ సీన్ చేసేటప్పుడు కూడా అక్కడ కొంతమంది మాత్రమే ఉన్నారు.అల నేను విస్కీ తాగి మరీ ఏడు టేక్స్ తీసుకొని నగ్న సీన్స్ చేశాను అంటూ కూబ్రా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే ఈ సీన్ పూర్తయ్యాక భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నానని ఎందుకంటే ఇప్పటివరకు నాలాగా ఎవరు కూడా నటించలేదు అని,కానీ ఆ సీన్ అయిపోయాక చాలా గర్వంగా కూడా ఉంది అంటూ కూబ్రా సైట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కుబ్రా సెట్ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: