సీనియర్ నటి ఆమని ఇప్పటికే సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో కూడా రాణిస్తోంది. సినిమాలో హీరోయిన్ అవకాశాలు తగ్గాక బుల్లితెరపై రాణిస్తోంది. అలా బుల్లితెరపై కొన్ని సీరియల్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. అయితే అలాంటి ఆమని తన భర్తకు విడాకులు ఇచ్చేసి పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.భర్తతో విడాకులు అయ్యాక ఆమని తన ఇద్దరు పిల్లలని చదివించుకోవడం కోసం సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో సీరియల్స్ బాట పట్టింది.అయితే అలాంటి ఆమని భర్త కోసం అప్పట్లో సూసైడ్ చేసుకోవాలి అనుకుందని, సూసైడ్ కూడా చేసుకుందని, చావు బతుకుల్లో ఉన్న ఆమనిని హాస్పిటల్ లో కూడా అడ్మిట్ చేశారని ఇలా ఎన్నో రూమర్లు తెరమీద వినిపించాయి.అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమని తన సూసైడ్ వార్తలపై స్పందించింది..

 ఆమని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను తమిళ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకున్నాను. ఆయన నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా చేసే సమయంలోనే నేను ఆయనతో ప్రేమలో పడ్డాను.అలా మా ఇద్దరి మధ్య ప్రేమ బంధం చిగురించి పెళ్ళి వరకు దారి తీసింది.ఇక మేము పెళ్లి చేసుకున్నాక కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత నా భర్త ఆర్థిక నష్టాలతో మునిగిపోయారు. ముఖ్యంగా ఓ సినిమాని నిర్మించి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ తిరిగి రాకపోవడంతో నష్టాలపాలయ్యారు. దాంతో అప్పుల వాళ్ళందరూ ఇంటి మీద పడడంతో చివరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మా ఆయన సూసైడ్ చేసుకొని చనిపోవాలి అనుకున్నారు.

అయితే ఆయన సూసైడ్ చేసుకోవడం చూసి వెంటనే హాస్పిటల్ కి తరలించాము. అలా హాస్పిటల్లో నా భర్తతోపాటు నేను అక్కడే ఉన్నాను కాబట్టి మీడియా వాళ్లందరూ నేనే సూసైడ్ చేసుకున్నానని తప్పుగా ప్రచారం చేశారు. కానీ నేను సూసైడ్ చేసుకోలేదు నా భర్త సూసైడ్ చేసుకున్నారు. ఇక కొద్దిరోజులయ్యాక మా మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి ఇద్దరం విడిపోవాలి అని నిర్ణయించుకున్నాం. అయితే విడిపోయినప్పటికీ కూడా మేము హ్యాపీగానే ఉన్నాం. అలాగే అప్పుడప్పుడు మా ఆయన నాకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇద్దరం అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చి ఒకే దగ్గర కలుసుకుంటాం కూడా అంటూ ఆమని చెప్పుకొచ్చింది. అలా ఆమని సూసైడ్ చేసుకుంది అనే వార్తలపై క్లారిటీ ఇచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: