
నన్ను జాగ్రత్తగా చూసుకునే మా వ్యక్తి మా అమ్మ అని నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తనే చూసుకుంటుందని శ్రీలీల పేర్కొన్నారు. పరీక్షలు వస్తున్నాయి ఏవైనా టిప్స్ చెప్పాలని కోరగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఎక్కువగా రివిజన్ చేసుకోవాలని గతంలో అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలని చాట్ జీపీటీ సలహాలు తీసుకోవాలని శ్రీలీల సూచనలు చేయడం గమనార్హం.
స్కిన్ కేర్ టిప్స్ చెబుతారా అనే ప్రశ్నకు స్పందిస్తూ మొటిమలు రావడం సాధారణం అని వాటి గురించి దిగులు చెందవద్దని శ్రీలీల సూచించారు. ప్రేమపై మీ ఒపీనియన్ ఏంటి అనే ప్రశ్నకు శ్రీలీల స్పందిస్తూ మీరు ప్రేమను కనుగొంటే దానిని గాలి కూడా చొరబడలేనంత గట్టిగా పట్టుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలీల కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
ఒకవైపు చదువుకుంటూ మరోవైపు హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అయితే సక్సెస్ రేట్ తక్కువగా ఉండటం శ్రీలీలకు ఒక విధంగా మైనస్ అని చెప్పవచ్చు. నితిన్, శ్రీలీల కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. శ్రీలీల కెరీర్ పరంగా మరిన్ని హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శ్రీలీల రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది. శ్రీలీల భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.