యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత తక్కువ కాలం లోనే దేవర పార్ట్ 2 మూవీ షూటింగ్ ను తారక్ మొదలు పెడతాడు అని చాలా మంది అనుకున్నారు.

కానీ తారక్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. కానీ దేవర 2 మూవీ ని మాత్రం స్టార్ట్ చేయలేదు. దానితో దేవర 2 మూవీ ఉండదు అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా తారక్ "మ్యాడ్ స్క్వేర్" మూవీ సక్సెస్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చాడు.

ఈవెంట్ లో భాగంగా దేవర 2 సినిమా గురించి మాట్లాడుతూ ... దేవర 2 మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఆ సినిమా ఉండదు అని అనుకోకండి. మధ్యలో అనుకోకుండా ప్రశాంత్ నీల్ మూవీ వచ్చింది. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత దేవర 2 మూవీ ని స్టార్ట్ చేస్తాం అని తారక్ తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇలా దేవర 2 మూవీ కి సంబంధించిన అప్డేట్ ను జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: