సినిమా సెల‌బ్రిటీలు అంటే ల‌క్ష‌ల్లో ఫ్యాన్స్.. గ్లామ‌ర‌స్ లైఫ్ అనుకుంటాం కానీ.. వాళ్లు కూడా మ‌న‌లాంటి మ‌నుషులే. వాళ్ల‌కు కూడా మ‌న‌లాంటి ఇష్టాయిష్టాలు, అల‌వాట్లు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ల అల‌వాట్లు వింటే.. వామ్మో ఇదేం అల‌వాటురా బాబూ అని షాకైపోతాం. లేటెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ త‌న డైలీ రొటీన్‌లో ఓ విష‌యం గురించి చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇంత‌కీ ఏం చెప్పిందో తెలుసా?

క‌రీనా క‌పూర్.. బాలీవుడ్ టాప్ హీరోయిన్.. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ భార్య‌. స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన క‌రీనా.. లెజెండ‌రీ యాక్ట‌ర్ రాజ్ క‌పూర్ మ‌న‌వ‌రాలు, ర‌ణధీర్ క‌పూర్‌, బ‌బితా క‌పూర్ కూతురు. 1980 సెప్టెంబ‌ర్ 21న ముంబైలో పుట్టింది. మొద‌ట్లో లాయ‌ర్ అవ్వాల‌ని అనుకుంద‌ట‌. లా కాలేజీలో కూడా జాయిన్ అయింది. కానీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లోనే మైండ్ మార్చుకుని సినిమాల్లోకి వ‌చ్చేసింది. బాలీవుడ్‌లో యాక్టింగ్ కోచ్‌గా ఫేమ‌స్ అయిన కిషోర్ నమిత్ క‌పూర్ ద‌గ్గ‌ర యాక్టింగ్ నేర్చుకుంది.

2000లో రెఫ్యూజీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది క‌రీనా. తొలి సినిమాతోనే త‌న అందం, న‌ట‌న‌తో అంద‌రినీ ఫిదా చేసింది. త‌ర్వాత ముజే కుచ్ కెహనా హై, క‌భీ ఖుషీ క‌భీ గ‌మ్‌, జ‌బ్ వియ్ మెట్‌, 3 ఇడియ‌ట్స్‌, బాడీగార్డ్‌, బ‌జ‌రంగీ భాయిజాన్‌, ఉడ్తా పంజాబ్‌ లాంటి ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది.

2012 అక్టోబ‌ర్ 16న సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది క‌రీనా. వీళ్ల‌కు ఇద్ద‌రు కొడుకులు. పెళ్లి త‌ర్వాత‌, ఫ్యామిలీ కోసం బ్రేక్ తీసుకున్నా కూడా.. ఇప్ప‌టికీ క‌రీనాకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రీసెంట్‌గా క్రూ, సింగం ఎగైన్‌ సినిమాల్లో క‌నిపించింది.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగ‌లు ప‌డ్డారు. ఆ టైమ్‌లో దొంగ‌ల దాడిలో సైఫ్‌కు గాయాలు కూడా అయ్యాయి. ఆ దెబ్బ‌ల నుంచి సైఫ్ కోలుకున్నా.. క‌రీనా మాత్రం ఇంకా ఆ షాక్ నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతుంద‌ట‌.

ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో క‌రీనా త‌న సీక్రెట్ చెప్పేసింది. అదేంటంటే.. త‌న‌కు కిచిడీ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. వారానికి ఐదుసార్లు కిచిడీ తింటుంద‌ట‌. కిచిడీ లేకుండా త‌ను ఉండ‌లేద‌ని చెప్పింది. కానీ.. కిచిడీ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని కూడా చెప్పింది. క‌రీనా కిచిడీ ల‌వ్ స్టోరీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. క‌రీనా అల‌వాటు విని నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: