
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కలిసి ప్రస్తుతం వార్ 2 అనే సినిమాలో కలిసి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ అన్ని సన్నాహాలను చేస్తూ వస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం కూలీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా ఈ రెండు సినిమాల్లో కలిపి నలుగురు స్టార్ హీరోలు నటించారు. ఇక ఈ రెండు మూవీలు ఒకే రోజు విడుదల అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలా జరిగినట్లయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.