కొన్ని సంవత్సరాల క్రితం మలయాళ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ "లూసిఫర్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మలయాళ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగులోకి వచ్చిన తర్వాత ఈ మూవీ ని మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ తో రీమేక్ చేశాడు. ఇక గాడ్ ఫాదర్ సినిమా కూడా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా మోహన్ లాల్ "లూసిఫర్" మూవీ కి కొనసాగింపుగా రూపొందిన L2 ఎంపురాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ మార్చి 27 వ తేదీన విడుదల అయింది. ఇక ఈ సినిమా అన్ని ఏరియాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా కేరళ , ఓవర్సీస్ లో మాత్రం మంచి ప్రభావాన్ని చూపింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 8 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

8 రోజుల్లో ఈ సినిమాకు కేరళ ఏరియాలో 71.45 కోట్ల కలెక్షన్లు దక్కగా , తెలుగు రాష్ట్రాల్లో 4.05 కోట్లు , తమిళనాడులో  8.35 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18.8 కోట్లు , ఓవర్సీస్ లో 134.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 112.35 కోట్ల షేర్ ... 237.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ 102 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఇక 8 రోజుల్లో ఈ సినిమాకు 10.35 కోట్ల రేంజ్ లో లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: