సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఎన్నో సినిమాల్లో కొన్ని సినిమాలు ప్లాప్‌ అయినా వాటికి మాత్రం ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది .. అలాంటి సినిమాల్లో ఖలేజా  , 1న్ నేనొక్కడినే  సినిమాలు ముందు వ‌రుస‌లో ఉంటాయి .. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1న్ నేనొక్కడినే  సినిమా ఎంతో రిచ్‌గా ఉంటుంది .. ఇక ఈ సినిమా కూడా ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది .  అలాగే 1న్ నేనొక్కడినే మూవీలో మహేష్ బాబు లుక్స్ మహేష్ కొడుకు గౌతమ్ క్యిమియో, సుకుమార్‌ స్క్రీన్ ప్లే , దేవిశ్రీ మ్యూజిక్ ఇలా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేలా చేశాయి . ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు  ఏ సినిమాకు కష్టపడని విధంగా కష్టపడ్డాడు .. అదే విధంగా ఇదే విషయాన్ని దర్శకుడు సుకుమార్ ఎన్నోసార్లు స్వయంగా కూడా చెప్పాడు .. అలాగే ఈ సినిమా కోసం మహేష్ బాబు నిజంగానే ఓ స్టంట్ కూడా చేశాడట ..


 విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి మహేష్ బాబు ఓ సీన్లో స్పీడ్ బోట్ తీసుకొని సముద్రంలోకి వెళ్తాడు .. అలానే మహేష్ ను వెంబడిస్తూ మరికొందరు కూడా అతన్ని ఫాలో అవుతూ ఉంటారు .. ఇక మహేష్ తప్ప ఆ సీన్లు నటించిన అందరూ ప్రొఫెషనల్ సిమ్మర్లే పైగా వారందరూ లైఫ్ జాకెట్లు కూడా వేసుకుని మరీ అందులో ప్రయాణించారు .  కానీ మహేష్ బాబు మాత్రం నార్మల్ డ్రెస్ అందులో వెళ్ళిపోతూ ఉంటాడు .. దానికి తోడు మహేష్ కు స్విమ్మింగ్ కూడా అంతంత మాత్రమే వచ్చుట .. ఓ ప్రొఫెషనల్ బోర్డ్ డ్రైవర్ స్పీడ్ బోట్ ను ఎంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడో దాన్ని మహేష్ బాబు అలానే డ్రైవ్ చేసుకుని ఆ సీన్ చేసేటప్పుడు మహేష్ తో పాటు చిత్ర యూనిట్ కూడా ఎంతో కష్టపడ్డాడని సుకుమార్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాడు
.

అలాగే ఎంతో కష్టపడి చేసిన సినిమా ప్లాప్‌ అయినప్పటికీ తను ఎంతో బాధపడుతున్నాను అని కూడా సుకుమార్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు .. అనవసరంగా హిట్ అయ్యే సినిమాను ప్లాప్‌ చేశానని అనిపిస్తుందని మొదటి ఒక వర్షన్ అనుకుని నిర్మాతకు చెప్పెనాని అతనికి కూడా బాగా నచ్చింది అని కానీ షూటింగ్ కి వెళ్ళాక తాను ఎమోషనల్ సైడ్ కి వెళ్లడంతో కథ మొత్తం మారిపోయిందని ఆడియన్స్ కు కన్ఫ్యూజ్గా మారిందని సుకుమార్ తెలిపాడు .. అలాగే మరో రెండు సీన్స్ తీసి ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడితే 1న్ నేనొక్కడినే ప్లాఫ్ అవ్వకుండా ఉండేదని కూడా సుకుమార్ చెప్పుకొచ్చాడు .. అయినా కూడా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇంత గొప్ప స్క్రీన్ పై ఎలా రాశారని అప్పట్లో సుకుమార్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా .. కానీ సినిమా మాత్రం ఆడియన్స్ కు అర్థం కాకపోవడంత మహేష్ కెరియర్ లో ప్లాప్‌ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: