మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఈ నగరానికి ఏమైంది సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును , మంచి విజయాన్ని సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన అనేక సినిమాలలో నటించి , కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించి తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే విశ్వక్ సేన్ కొన్ని సంవత్సరాల క్రితం పలకనామ దాస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో విశ్వక్ సేన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విశ్వక్ సేన్ కి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది. ఇకపోతే తాజాగా పలకనామ దాస్ మూవీ బృందం వారు ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు పలకనామ దాస్ మూవీ ని ఏప్రిల్ 10 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన అనేక తెలుగు సినిమాలు మంచి కలెక్షన్లను రాబట్టాయి. మరి పలకనామ దాస్ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఆఖరుగా విశ్వక్ సేన్ "లైలా" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: