టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. జగపతి బాబు ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి మేకర్స్ కొన్ని పోస్టర్లను విడుదల చేశారు. అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ షాట్ వీడియోను ఈ సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షాట్ వీడియోను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6 వ తేదీన ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు ఈ అప్డేట్ ను తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్లో ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సనా మరియు ఈ సినిమా సంగీత దర్శకుడు అయినటువంటి ఏ ఆర్ రెహమాన్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: