
చాలామంది ట్రోల్ చేసినప్పటికీ తాజాగా బాలీవుడ్ నటి అమీషా పటేల్ తమ అభిప్రాయాలను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది. అలాగే సికిందర్ సినిమా మీద వస్తున్న నెగిటివ్ టాక్ గురించి మాట్లాడడం రష్మిక, సల్మాన్ ఖాన్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నించగా అందుకు ఆమె ఇలా సమాధానాన్ని తెలియజేసింది. అమీషా పటేల్ మాట్లాడుతూ.. గద్దర్ సినిమా ఉదాహరణగా చెబుతూ ఈ చిత్రంలో సన్నీడియోల్ కు తనకు 20 ఏళ్లు గ్యాప్ ఉందని కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని వెల్లడించింది. సినిమా కూడా సక్సెస్ అయ్యిందని తెలిపింది.
సినిమాల గురించి ప్రతికూలంగా మాట్లాడే వారి గురించి అసలు పట్టించుకోకూడదని కొందరు జనాలు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు.. అది వాళ్ళ పని.. వారు మాట్లాడే మాటలు అర్థరహితం అంటూ అమీషా పటేల్ తెలియజేసింది. అమీషా పటేల్ తెలుగులో బద్రి సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు జరిగింది. ప్రస్తుతం ఈయన వయసు 49 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తన గ్లామర్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా మెయింటెన్ చేస్తోంది. ఇప్పటికి అమీషా పటేల్ వివాహం చేసుకోలేదు ఈ ముద్దుగుమ్మ.