టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన డీజే టిల్లు , టిల్లు స్క్వేర్ మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా సిద్దు "జాక్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ అనేక ప్రసార చిత్రాలను విడుదల చేశారు. ఈ మూవీ నుండి ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జాక్ మూవీ ని ఏకంగా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.

అందుకు సంబంధించిన ప్రణాళికలను కూడా మేకర్స్ ఇప్పటికే పక్కా గా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జాక్ , జాక్ ప్రో , జాక్ ప్రో మ్యాక్స్ అనే టైటిల్ లతో ఈ మూవీ యొక్క మూడు భాగాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం సిద్దు "తెలుసు కదా" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమాలో రాసి కన్నా , శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: