ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుండగా ఆ సీక్వెల్ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే కల్కి సీక్వెల్ ఒకింత ఆలస్యం కానుందని ఇప్పటికే వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కల్కి2 గురించి నాగ్ అశ్విన్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.
 
నాగ్ అశ్విన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. కల్కి సీక్వెల్ గురించి నాగ్ అశ్విన్ ను అప్ డేట్ అడగగా ఆయన కల్కి2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని నాగ్ అశ్విన్ అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని నాగ్ అశ్విన్ తెలిపారు. కల్కి సీక్వెల్ కు ఇంకా చాలా సమయం పడుతుందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఆయన తెలిపారు.
 
స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యి కెరిరి పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ ఏడాద్ చివరినాటికి కల్కి2 సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. నాగ్ అశ్విన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం రికార్డ్ లను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాగ్ అశ్విన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. నాగ్ అశ్విన్ ను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.


 
 


మరింత సమాచారం తెలుసుకోండి: