ప్రస్తుతం వరుస విజయాలతో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న తెలుగు హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈ మధ్య కాలంలో ఈయన నటించిన సినిమాలు వరుసగా విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. ఇకపోతే నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు ఆయన బడ్జెట్ , ఇప్పటివరకు ఈ మూవీ కి జరిగిన బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాని రెమ్యూనిరేషన్ కాకుండానే ఈ మూవీ కి 60 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాలేదు. మరికొంత భాగం షూటింగ్ మిగిలి ఉంది. అలాగే ప్రమోషన్స్ కూడా మిగిలి ఉన్నాయి. దానికి ఈ మూవీ కి మరి కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇలా హిట్ 3 మూవీకి భారీ బడ్జెట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు మంచి బిజినెస్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ఇప్పటికే ఓ ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు , ఈ మూవీ ఓ టి టి హక్కులు ఏకంగా 54 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

అలాగే ఈ సినిమా యొక్క ఆడియో హక్కులు కూడా ఆరు కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. దానితో ఇప్పటికే ఈ సినిమాకు ఇప్పటి వరకు నాని రెమ్యూనరేషన్ కాకుండా పెట్టిన ఖర్చు మొత్తం వెనక్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి సంబంధించిన థియేటర్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. దానితో ఈ మూవీ విడుదలకు ముందే లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: