మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రవితేజ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయనకు మంచి విజయం దక్కి మాత్రం చాలా కాలమే అవుతుంది. రవితేజ ఆఖరుగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా. .. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ హిందీ సినిమా అయినటువంటి రైడ్ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల కావడం కష్టమే అని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే రవితేజ తన తదుపరి మూవీ ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ను ఈ మూవీ బృందం వారు శ్రీరామ నవమి సందర్భంగా ఓ పోస్టర్ తో తెలియ జేయనున్నట్లు సమాచారం అందుతుంది.

మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను శ్రీరామ నవమి రోజు విడుదల చేసి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఈ సంవత్సరం జూన్ లేదా జూలై నుండి మొదలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అలాగే ఈ సినిమా యొక్క షూటింగ్ను , పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుక విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: