నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే మూవీ కి కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. నాని , శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో దసరా అనే మూవీ వచ్చి మంచి విజయం సాధించి ఉండడంతో ది ప్యారడైజ్ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం విడుదల చేయగా అది అద్భుతమైన రీతిలో ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా జనాల్లో పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మే 2 వ తేదీ నుండి ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే నాని "హిట్ ది థర్డ్ కేస్"  సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత , ఆ మూవీ విడుదల తేదీ వరకు హిట్ సినిమా ప్రమోషన్లలో పాల్గొనబోతున్నట్లు , ఆ మూవీ ప్రమోషన్లు మొత్తం కంప్లీట్ అయ్యి , ఆ సినిమా విడుదల అయ్యాక ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో నాని జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేసు మూవీ లు అద్భుతమైన విజయాలు సాధించడంతో హిట్ థిస్ థర్డ్ కేస్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి హిట్ ది థర్డ్ కేస్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: