సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..’SSMB 29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...మహేష్ బాబు ఈ సినిమా కోసం పూర్తిగా తన లుక్ చేంజ్ చేసుకున్నారు.. గంటలు తరబడి జిమ్ లోనే గడుపుతున్నారు.. ఇటీవల సీక్రెట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసారు.. త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా ప్రారంభించనున్నారు.. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కి కావాల్సిన సెట్ హైదరాబాద్ లో తయారుచేస్తున్నారు.ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ తాను సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంతే ఇంపార్టెన్స్ ఫ్యామిలీ కి కూడా ఇస్తారు.. తన షూటింగ్స్ కి బ్రేక్ దొరికితే మహేష్ తన ఫ్యామిలీ తో విదేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోతారు.

కానీ రాజమౌళి సినిమా మొదలయ్యే ముందు మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకున్నాను అని ఒక పోస్ట్ పెట్టారు. సినిమా అయ్యేవరకు మహేష్ ఏ వెకేషన్ కి వెళ్ళలేడు అని రాజమౌళి ఇన్ డైరెక్ట్ గా చెప్పేసాడు.. దీనితో ఫ్యాన్స్ కూడా రాజమౌళిని దాటుకొని వెళ్లడం అంత ఈజీ కాదు అంటూ కామెంట్స్ చేసారు.. రాజమౌళి సినిమా అంటే హీరోలు ఆయన చెప్పిన నియమాలు కచ్చితంగా పాటించాల్సిందే.. కానీ మహేష్ సినిమా విషయంలో మాత్రం ఆ రూల్స్ అన్నీ మారాయి.

మహేష్ తనకు నచ్చినట్టు యాడ్స్ చేస్తున్నాడు, బయట తిరుగుతున్నాడు.ఇప్పుడు మహేష్ బాబు వెకేషన్ కి కూడా వెళ్తున్నాడు. నేడు మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు.. అక్కడ ఉండే కెమెరామెన్స్ ఫోటోలు తీస్తుంటే వాళ్ళకి మహేష్ తన పాస్ పోర్ట్ ని చూపించాడు. దీంతో రాజమౌళి దగ్గర్నుంచి మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకొని వెకేషన్ కి వెళ్లిపోయాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఎన్ని రూల్స్ వున్నా బాబు ని ఎవరు ఆపలేరు మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: