టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాడ్ సీక్వెల్ ఈవెంట్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తాజాగా ఒక ఈవెంట్ లో కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
హృతిక్ రోషన్ మాట్లాడుతూ ఒక సాంగ్ మినహా వార్2 షూటింగ్ పూర్తైందని నాకు ఇష్టమైన కోస్టార్ జూనియర్ ఎన్టీఆర్ అని వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ మంచి టీమ్ మేట్ అని మా సినిమా అద్భుతంగా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వార్2 సినిమా ఆగష్టు 14వ తేదీన థియేటర్లలోకి రానుందని హృతిక్ రోషన్ కామెంట్లు చేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
 
వార్ సినిమా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కి సూపర్ సక్సెస్ సాధించగా ఈ సినిమాకు సీక్వెల్ గా వార్2 తెరకెక్కుతోంది. వార్2 సినిమాలో తారక్ రా ఏజెంట్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో కూడా పలువురు బాలీవుడ్ స్టార్స్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. బాలీవుడ్ ఎంట్రీ జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతమేర కలిసొస్తుందో చూడాల్సి ఉంది.
 
వార్2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడు కాగా ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వార్2 సినిమా సౌత్ ఇండియాలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమాకు పోటీగా కూలీ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. వార్2 సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: