
దాసరి నారాయణరావు నాకు సినిమాల్లో మొదటి ఛాన్స్ ఇచ్చారని స్వర్గం నరకం సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని ఆయన తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు నేను కెరీర్ ను కొనసాగిస్తున్నానని మోహన్ బాబు వెల్లడించారు. ప్రతిజ్ఞ సినిమాతో నేను నిర్మాతగా మారానని నా బ్యానర్ ను ప్రారంభించింది సీనియర్ ఎన్టీఆర్ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు ఆ ప్రారంభోత్సవానికి క్లాప్ కొట్టారని ఆయన తెలిపారు. అదే బ్యానర్ పై సీనియర్ ఎన్టీఆర్ హీరోగా మేజర్ చంద్రకాంత్ సినిమా తీశానని సీనియర్ ఎన్టీఆర్ వద్దని వారించినా ఆ సినిమా తీసి సక్సెస్ అయ్యానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. రాజకీయాలు నాకు సెట్ అవ్వవని నేను కోరుకున్నవి అన్నీ జరిగాయని ఆయన తెలిపారు. దేవుడి ఆశిస్సులతో మంచి రోల్స్ వస్తే పిల్లలతో సరదాగా ఉండాలని అనుకుంటున్నానని మోహన్ బాబు పేర్కొన్నారు.
సినిమా ఫెయిల్యూర్ వేరు నటుడిగా ఫెయిల్ కావడం వేరని నేను నటుడిగా ఎప్పుడూ ఓడిపోలేదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. దాదాపుగా 560 సినిమాలు చేశానని మోహన్ బాబు కామెంట్లు చేశారు. ఇప్పుడు నా పిల్లలు నటిస్తున్నారని నేను అరుదుగా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఒక్కొక్కరికీ కోపం ఒక్కో విధంగా ఉంటుందని మోహన్ బాబు వెల్లడించారు. నాకు ఆవేశం ఎక్కువేనని మోహన్ బాబు తెలిపారు. మోహన్ బాబు రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.