
ఇటీవలే ఒక పాడ్ కాస్ట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ కన్నప్ప సినిమా గురించి అలాగే పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలను తెలిపారు. జీవితంలో తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని ఎవ్వరికీ చెప్పకుండా నాలుగు మైళ్ళు దూరం ఉన్న థియేటర్ కి వెళ్లి మరి రాజమకుటం అనే చిత్రాన్ని చూశానని తెలిపారు. మొదటిసారి దాసరి నారాయణరావు గారు తనకి 1975లో స్వర్గం నరకం అనే చిత్రంలో అవకాశాన్ని ఇప్పించారని అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళ చిత్రాలలో కంటిన్యూ అవుతూ ఉన్నానని తెలిపారు.
అలా తన నటనతో ప్రతిజ్ఞ అనే చిత్రం ద్వారా ప్రొడ్యూసర్ గా మారానని.. తన బ్యానర్ ని సీనియర్ ఎన్టీఆర్ మొదలుపెట్టారు.. తన సొంత బ్యానర్ లో ఆస్తులు అన్నిటిని తాకట్టు పట్టి మరి మేజర్ చంద్రకాంత్ వంటి సినిమా అని తీశానని ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ గారు తనని మందలించారు. అయినా కూడా మొండిగా ఆ సినిమాను తీయడంతో సక్సెస్ అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు 560 సినిమాలలో నటించాను తనకు ఆవేశం ఎక్కువ అని కానీ ఎప్పుడూ ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదని తనని మోసం చేసిన వారి చాలామంది ఉన్నారని.. అప్పటినుంచి తనకు చాలా ఆవేశం పెరిగిపోయింది.. ఆవేశమే తనకు చాలా నష్టాన్ని కలిగించింది అంటూ వెల్లడించారు.