టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నయనతార నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో నయనతార నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పెళ్లి తర్వాత నయనతారకు కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో కలిసిరాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. నయనతార నటించి తాజాగా విడుదలైన టెస్ట్ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
 
నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేదు. కథనం ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారిందని చెప్పవచ్చు. నయనతారపై ఈ మధ్య కాలంలో వచ్చిన నెగిటివిటీ కూడా ఈ సినిమాపై ప్రభావం చూపింది. ధనుష్ ఫ్యాన్స్ నయనతార విషయంలో ఒకింత సీరియస్ గా ఉన్నారనే సంగతి తెలిసిందే.
 
సోషల్ మీడియా వేదికగా ధనుష్ అభిమానులు టెస్ట్ సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ధనుష్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం నయనతార కెరీర్ కు ఒక విధంగా శాపంగా మారిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పైరసీ కూడా టెస్ట్ సినిమాకు ఒక విధంగా మైనస్ అయిందని పైరసీ ఈ సినిమాపై ప్రభావం చూపిందని సమాచారం అందుతోంది.
 
రాబోయే రోజుల్లో కూడా నయనతార థియేట్రికల్ రిలీజ్ లకు కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. నయనతార రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నయనతార బ్యాక్ టు బ్యక్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నయనతార నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నయనతార ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నయనతార వ్యక్తిగత కెరీర్ వల్ల ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి: