ఈ ఏడాది మొదటిలోనే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఒకరు.. వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన వీరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఏకంగా ఈ సినిమా 300 కోట్ల క్లబ్లోకి చేరింది. ముఖ్యంగా ఐశ్వర్య, వెంకటేష్ ,మీనాక్షి మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా ఉన్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తన కెరియర్ లోనే మరొక బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఐశ్వర్య రాజేష్ ఇందులో గృహిణిగా బాగా ఆకట్టుకుంది.


ఇలా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో కచ్చితంగా తెలుగులో అవకాశాలు వస్తాయని ఈమె అభిమానులు భావించారు.కానీ ఇప్పటివరకు ఏ ఒక్క తెలుగు సినిమా పైన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం సుడల్ అనే ఒక వెబ్ సిరీస్ విడుదలయ్యి పలకరించిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో మాత్రం సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఆఫర్లు రావట్లేదట. గతంలో కూడా ఐశ్వర్య రాజేష్ తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఛాన్సులు రాకపోవడం పైన ఆమె బహిరంగంగానే తెలియజేసింది.


మొదట కౌసల్య కృష్ణమూర్తి అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో మాత్రం కనీసం పది సినిమాలు కూడా నటించలేదు. తమిళంలో వరుసగా సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే ఎన్నో చిత్రాలలో  నటించినట్లు తెలుస్తోంది. ఎక్కువగా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ ఉన్నది. ఇప్పటికీ కూడా పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది ఐశ్వర్య రాజేష్. అలాగే కన్నడ సినీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. కానీ టాలీవుడ్ లో మాత్రం ఈమెకు సరైన అవకాశాలు అందుకోలేకపోతోంది. మరి ఇక మీదట నైన ఐశ్వర్య రాజేష్ కు తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలు అవకాశాలు కల్పిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: