బుచ్చిబాబు సనా ..సుకుమార్ శిష్యుడుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఉప్పెన సినిమాతో తన రేంజ్ మారిపోయేలా చేసుకున్నాడు . "ఉప్పెన" సినిమాలో ఆయన చూపించిన సీన్స్ చాలా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. చాలామంది బుచ్చిబాబు సన ని  ఓ రేంజ్ లో పొగిడేసారు . ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమాకే పాన్ ఇండియా హీరోని పట్టేశాడు అంటే ఆయనలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు . ప్రెసెంట్ బుచ్చిబాబు సనా.. రామ్ చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు.


ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది. అయితే ఈ సినిమా కంప్లీట్ అవ్వక ముందే మరొక స్టార్ హీరోని పట్టేసాడు బుచ్చిబాబు సనా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఆయన మరెవరో కాదు స్టార్ హీరో .. పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ . నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తో ఎప్పుడో సినిమా తెరకెక్కించాలి. వాళ్ల మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది . నిజానికి ఉప్పెన సినిమా తర్వాత ఆయన ఒక కథను అనుకున్నాడు.  ఆ కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించారు .



కానీ కొన్ని మార్పులు చేర్పులు చేశారట జూనియర్ ఎన్టీఆర్ . ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు జూనియర్ ఎన్టీఆర్ - బుచ్చిబాబు సన . చాలామంది ఇప్పుడు రామ్ చరణ్ తో తెరకెక్కించే  సినిమా జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ అని అనుకున్నారు . కానీ అది కానే కాదట . జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ అలాగే సేఫ్ గా ఉందట . రామ్ చరణ్ కోసం స్పెషల్ గా ఈ కథను రాసుకున్నారట.  కాగా రామ్ చరణ్ తో ఈ సినిమా అయిపోయిన తర్వాత బుచ్చిబాబు సనా.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కిస్తాడు అనే టాక్  ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి ఈ వైరల్ అయ్యే వార్తలో ఎంత నిజం ఉంది అనేది..???

మరింత సమాచారం తెలుసుకోండి: