
మరీ ముఖ్యంగా సుకుమార్ - అల్లుఅర్జున్ ని మాస్ యాంగిల్ లో చూపించడం అల్లు అర్జున్ కెరీర్ ని మార్చేయడం అందరికీ షాకింగ్ గా ఉంది. ఒకానొక ఈవెంట్ లో బన్నీ స్టేజీ పై మాట్లాడుతూ సుకుమార్ ని ఎలా పొగిడేశాడో అందరికి తెలుసు. అల్లు అర్జున్ ఓపెన్ గానే చెప్పాడు సుకుమార్ లేకపోతే నాకు లైఫ్ లేదు అని ..ఇప్పుడు ఈ స్ధాయిలో ఉండే వాడిని కాదు
అది కూడా ఆయన ఫేవరెట్ హీరోనే. కానీ సినిమా మాత్రం తెరకెక్కించలేదు . ఆయన మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ . వీళ్లిద్దరి కాంబోలో "నాన్నకు ప్రేమతో" సినిమా వచ్చింది. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాలి . ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ గ్యాంగ్ స్టార్ తరహాలో ఉన్న సినిమాలలో నటించలేదు . అలాంటి ఒక కథను ఎన్టీఆర్ కోసమే రాసుకున్నారట సుకుమార్. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ప్రతిసారి ఆ సినిమాను అనుకున్న మూమెంట్లో ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంది . అలా అలా ఇప్పటికీ ఆ సినిమా వెనక్కి వెళ్ళిపోతూనే వస్తుంది. ఫ్యూచర్ లోనైనా ఆ కథ జనాలకు చూపిస్తాడో లేదా సుకుమార్ వేచి చూడాలి. ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలు పాన్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు..!!