మహేష్ బాబు - రాజమౌళి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ రెండు పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి . పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ..మహేష్ బాబుతో ఓ సినిమాను  తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసించ్దే.  అందులో పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏదీ లేదు.  ఇప్పటికే మొదటి షెడ్యూల్ ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ అయింది . అయినా సరే ఆయన సినిమాకు సంబంధించి ఒకటి అంటే ఒకటి కూడా అప్డేట్ ఇవ్వలేదు . రాజమౌళి ఎప్పటిలా కాకుండా ఈసారి డిఫరెంట్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .


ఒక నిధి కోసం జరిగే అడ్వెంచర్స్ కధనే ఈ సినిమా అంటూ ఓ టాక్ బయటకు వచ్చింది.  ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది . ఈ సినిమాలో చాలామంది స్టార్స్ గెస్ట్ పాత్రలో చూపించబోతున్నాడట జక్కన్న.  కాగా ఈ సినిమా స్టార్టింగ్ మూమెంట్లో జక్కన్న సినిమాని అనౌన్స్ చేయకుండానే మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకున్నాడు అంటూ ఒక ఫన్నీ వీడియో బాగా వైరల్ అయ్యింది . అయితే ఇప్పుడు దానికి కౌంటర్ గా మరొక వీడియో కూడా ట్రెండ్ అవుతుంది.



మహేష్ బాబు పాస్ పోర్ట్ తిరిగి ఇచ్చేశాడు జక్కన్న.  దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.  మహేష్ బాబు వెకేషన్ కి కూడా వెళ్ళిపోయాడు.  దీంతో మహేష్ బాబు కోసం జక్కన్న బిగ్ శాక్రిఫైజ్ చేశాడు అని సాధారణంగా తాను ఏదైనా సినిమా హీరోతో కమిట్ అయితే ఆ హీరోకి చుక్కలు చూపిస్తాడు అని.. కానీ మహేష్ బాబు కోసం కెరియర్ లో ఫస్ట్ టైం ఇలా కాంప్రమైజ్ అయ్యి మరీ పాస్ పోర్ట్ ఇచ్చేశాడు అని మళ్లీ సెకండ్ షెడ్యూల్ కి పాస్ పోర్ట్ లాగేసుకుంటాడేమో అంటూ ఫన్నీగా మీమ్‌స్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!



మరింత సమాచారం తెలుసుకోండి: