
జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో సినిమాలో నటించాడు . అఫ్ కోర్స్ కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఫ్లాప్ అయినా ఆయన సినిమాలలో కూడా ఆయన నటన బాగుంటుంది.
కాగా నందమూరి ఫ్యాన్స్ ఎప్పటినుంచో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ ఇష్టపడుతున్నారు కోరుకుంటున్నారు . ఆ సినిమా మరేంటో కాదు "అదుర్స్ 2". వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా షీలా - నయనతార హీరోయిన్గా నటించిన సినిమా అదుర్స్ .
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. కామెడీ యాంగిల్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని మనం ఇలాంటి ఒక యాంగిల్ లో చూడలేదు. అలాంటి సినిమాకి సీక్వల్ అంటూ రావాలి అని నందమూరి ఫ్యాన్స్ బాగా కోరుకున్నారు . కానీ ఆ సినిమాకి సీక్వెల్ రానే రాదు అంటూ తేల్చి చెప్పేసాడు జూనియర్ ఎన్టీఆర్ . రీసెంట్గా మ్యాడ్ 2 సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. "నవ్వించడం చాలా టఫ్ జాబ్ అని.. అది అందరివల్ల కాదు అని .. అది కొందరికే సెట్ అవుతుంది అని .. ఆ కారణంగానే అదుర్స్ 2 సినిమా ఎన్నిసార్లు ప్లాన్ చేసిన సెట్ కాకుండా పోతుంది అని.. అలాంటి సినిమాను అసలు ఇక చేయలేము అని కూడా పరోక్షకంగా చెప్పేశారు . దీంతో నందమూరి ఫ్యాన్స్ కూసింత డిసప్పాయింట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది..!