సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న 'సికిందర్' సినిమాలో వాళ్ల మధ్య 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై హీరోయిన్ అమీషా పటేల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏజ్ గ్యాప్ గురించి ఎక్కువ రాద్ధాంతం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడింది.

ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో అమీషా మాట్లాడుతూ.. తనకి, సన్నీ డియోల్ కి మధ్యలో కూడా చాలా ఏజ్ గ్యాప్ ఉందని గుర్తు చేసింది. "నాకూ సన్నీ జీకి మధ్యలో 20 ఏళ్ల గ్యాప్ ఉంది. కానీ కొన్ని జంటలు స్క్రీన్ మీద బాగా వర్క్ అవుట్ అవుతాయి అంతే" అని చెప్పింది. అంతేకాదు నవ్వుతూ.. "సల్మాన్ జస్ట్ ఎవరికైనా పర్ఫెక్ట్ జోడీగా నిలుస్తాడు అంతే" అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.

ఇది కొత్తేమీ కాదు, ఇదివరకు కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. 'సికిందర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సల్మాన్ కూడా ఈ విమర్శలపై రియాక్ట్ అయ్యాడు. అలాంటి కామెంట్స్ ని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. చాలా బోల్డ్ గా రిప్లై ఇచ్చాడు. "నాకు, హీరోయిన్ కి 31 ఏళ్ల గ్యాప్ ఉందని అంటున్నారు. కానీ హీరోయిన్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ల నాన్నకి కూడా ఓకే అయితే మీకెందుకు ప్రాబ్లం? హీరోయిన్ కి పెళ్లయి పాప పుట్టాక తన కూతురుతో కూడా నేను చేస్తా. వాళ్ల అమ్మ పర్మిషన్ కూడా తీసుకుంటా" అని సల్మాన్ అన్నాడు.

సల్మాన్ ఇచ్చిన రిప్లై కి కొంతమంది ఫ్యాన్స్ విజిల్స్ వేస్తే, ఇంకొంతమంది మాత్రం విమర్శించారు. చాలామంది హీరోలు తమకంటే చాలా చిన్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడంపై మళ్లీ డిస్కషన్ మొదలైంది.

ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న 'సికిందర్' మూవీ మార్చి 30న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా కాజల్ అగర్వాల్, శర్మాన్ జోషి, సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: