గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెర కెక్కిస్తున్న ఈ సినిమాకు ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ వుంది.. రీసెంట్ గా చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాంచరణ్ రగ్గడ్ లుక్ లో కనిపించాడు.. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కనుంది.. అయితే ఈ సినిమాలో రాంచరణ్ “ ఆట కూలీగా “ కనిపించనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..గేమ్ ఛేంజర్ సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది.. ఆ సినిమా కోసం చరణ్ ఇన్నాళ్లు ఎంతో టైం వేస్ట్ చేసాడు.. దీనితో తన తరువాత సినిమాలకు ఎలాంటి బ్రేక్స్ లేకుండా పర్ఫెక్ట్ టైం ని సెట్ చేసుకుని దూసుకుపోతున్నాడు.ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చరణ్ తన సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. పెద్ది సినిమా తరువాత వెంటనే సుకుమార్ తో ఓ భారీ మూవీని చరణ్ లైన్ లో పెట్టాడు..

 పెద్ది మూవీ పూర్తి అయిన వెంటనే చరణ్ సుకుమార్ మూవీని స్టార్ట్ చేస్తాడు.. ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.. ఫ్యాన్స్ ను ఎంతగానో ఊరిస్తూ వస్తున్న “పెద్ది” గ్లింప్స్, ఫస్ట్ షాట్ ను రేపు గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. 

ఏప్రిల్ 6 శ్రీరామనవని సందర్బంగా  ఆ రోజు ఉదయం 11.45 గంటలకు ఫస్ట్ షాట్ తో పాటు, రిలీజ్ డేట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్  చేయనున్నారు..రీసెంట్ గా మ్యూజిక్ మిక్సింగ్ పూర్తి అయినట్లు..ఏ ఆర్ రెహమాన్ తో దిగిన ఫోటోను బుచ్చి బాబు సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా.. తాజాగా రాంచరణ్ సైతం పెద్ది ఫస్ట్ షాట్ అభిమానులను కచ్చితంగా మెప్పిస్తుంది అని రెహమాన్ మ్యూజిక్ మిక్సింగ్ వీడియోను షేర్ చేసారు..


మరింత సమాచారం తెలుసుకోండి: