మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందిన మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం L2 ఎంపురాన్. ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించడమే కాకుండా నటుడుగా కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాని లూసిఫర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించారు మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్స్ అని రాబట్టి పలు రకాల రికార్డులను కూడా క్రియేట్ చేస్తోంది L2 ఎంపురాన్.


అంతే వేగంగానే ఈ చిత్రం పైన విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా విషయంలో కూడా డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కు ఐటి శాఖ నుంచి కూడా నోటీసులు జారీ అయినట్లుగా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ వివాదం పైన కూడా మోహన్ లాల్ స్పందించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా మోహన్లాల్ తన ట్విట్టర్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను సైతం షేర్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. L2 ఎంపురాన్ సినిమా మలయాళ సినీ చరిత్రలోనే అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రాజ్యమేలుతోందంటూ తెలియజేశారు.


కొత్త సినీ పరిశ్రమకు బెంచ్ మార్కుగా నిలుస్తోంది.ఈ క్షణం మాకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఉన్నదని తెలిపారు. మీకు సమీపంలో థియేటర్లో విజయవంతంగా రన్ అవుతోంది అంటూ తెలియజేశారు.. అలా చేతులెత్తి దండం పెడుతూ ఒక ఫోటోని సైతం షేర్ చేశారు. అయితే మోహన్లాల్ ఈ విధంగా ఒక పోస్ట్ ని షేర్ చేయడంతో..L2 ఎంపురాన్ సినిమా వివాదం వదిలేయాలంటూ ఇలా పెట్టారని అంత మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే మరి కొంతమంది మాత్రం ఇది మలయాళ సినీ ఇండస్ట్రీలోనే అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన సినిమా అని తెలుసుకోవడానికి అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చారంటూ తెలియజేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: